గెలిచే ఛాన్సున్న దగ్గర తన వాళ్లు.. ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్ద పీట వేశారు
  • బలివ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం దళితులు, బీసీలు గుర్తుకొస్తారు
  • మోత్కుపల్లి నుంచి వర్ల రామయ్య వరకు అదే తంతు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దళితులు, బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. 'టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్ద పీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినపుడు మాత్రం దళితులు, బీసీలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, బంగి అనంతయ్య నుంచి ప్రస్తుత వర్ల రామయ్య గారి వరకు అదే తంతు. గెలిచే ఛాన్సున్న దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు' అంటూ ట్వీట్ చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News